Candidate | మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో..

Candidate | మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో..

  • పారేవుల అభివృద్ధి
  • ఆశీర్వదించి అండగా నిలవండి..
  • అంజమ్మను సర్పంచ్ గా గెలిపించండి
  • మార్కెట్ డైరెక్టర్ పాతింటి విష్ణువర్థన్ రెడ్డి

Candidate | మక్తల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సాకారంతో పారేవుల గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కటికే అంజమ్మ ఆంజనేయులును సర్పంచ్ గా గెలిపించాలని మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాతింటి విష్ణువర్ధన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ‌ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కటికె అంజమ్మ ఆంజనేయులుకు మద్దతుగా గ్రామంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఓటర్థను కలుసుకొని గ్రామ అభివృద్ధి కోసం ఎన్నికల్లో సర్పంచిగా అవకాశం కల్పించవలసిందిగా విన్నవించారు.

సర్పంచ్ గా గెలిపిస్తే చేపట్టబోయే అభివృద్ధి పనులను ఓటర్లకు వివరించి మద్దతును కోరారు. పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా అందజేయడమే తమ లక్ష్యమన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఇతరుల మాయమాటలకు మోసపోకుండా నిస్వార్ధంగా సేవ చేసేందుకు మహిళలగా ముందుకు వచ్చిన కటికె అంజమ్మ ఆంజనేయులుకు అండగా నిలవాల్సిందిగా ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని తమకు మద్దతునిచ్చి సర్పంచ్ గా కటికె అంజమ్మ ఆంజనేయులును గెలిపించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం నాయకులు రవీందర్ రెడ్డి, మణివర్థన్,ఇటిక్యాల ఆంజనేయులు, ఆంజనేయులు, గోపాల్, లింగారెడ్డి, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply