Candidate | గ్రామ అభివృద్ధికి అంకితమవుతా..
- సర్పంచ్ అభ్యర్థి నల్ల నీరజ సతీష్ రెడ్డి
Candidate | గొల్లపల్లి, ఆంధ్రప్రభ : గొల్లపల్లి మండల కేంద్ర గ్రామపంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థి నల్ల నీరజ సతీష్ రెడ్డి వైపే ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. ఎవరు చూసినా నీరజ సతీష్ రెడ్డి సర్పంచ్ కావాలి అంటున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుల మతాలకతీతంగా అందరినీ కలుపుకొని సర్పంచ్‌గా గెలిచాక గ్రామ అభివృద్ధికి అంకితమై పని చేస్తానంటున్నారు. తనను గెలిపిస్తే నిస్వార్థంతో నిజాయితీగా పని చేస్తానన్నారు. గ్రామాన్ని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతానంటున్నారు.

