భారీ ఎత్తున ప్రదర్శనగా ర్యాలీతో ప్రచారం..

వైరా, ఆంధ్రప్రభ : వైరా మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదో వార్డులో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ ఆ వార్డులో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. ఈ ప్రచారానికి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తాతా మధు, వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి, బిఆర్ఎస్ పార్టీ వైరా మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి కట్టా స్వరూప రాణి ,సిపిఎం నియోజకవర్గ నాయకులు భూక్య వీరభద్రం, జిల్లా నాయకులు బొంతు రాంబాబు, బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు ప్రచారంలో పాల్గొన్నారు… సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగిన సమర్థవంతమైన పోరాటపటిమ కలిగిన మహిళా నాయకురాలు గుడిమెట్ల రజిత అని మీ అమూల్యమైన ఓటును సుత్తి కొడవలి నక్షత్రం పై వేసి అఖండ విజయంతో గెలిపించాలని ఓటర్లను ఆకాంక్షించారు.. సిపిఎం నాయకులు కొంగర సుధాకర్, సుంకర సుధాకర్, మచ్చా మణి తోపాటు పలువురు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
