Campaign | జోరుగా ఇంటింటి ప్రచారం..

Campaign | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఉట్నూర్ మండలంలోని నాగపూర్ పంచాయతీ సర్పంచ్ గా తనని ఆశీర్వదించి గెలిపిస్తే పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని నాగపూర్ సర్పంచ్ అభ్యర్థి కల్పన సునీల్ జాదవ్ అన్నారు. వారు సోమవారంనాగపూర్ పంచాయతీలోని భీంగూడా అప్లికేషన్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం జోరుగా నిర్వహించారు. ఉంగరం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ప్రజలకు కోరారు. గత ఎన్నికల్లో తన భర్త సునీల్ జాదవ్ నాగపూర్ పంచాయతీ ప్రజలు ఆదరించి గెలిపించారని ఎంతో అభివృద్ధి చేశారని ఆయన అండదండతో తనను ఆశీర్వదిసి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని కల్పన సునీల్ జాదవ్ తెలిపారు. గ్రామపంచాయతీలో రోడ్లు మంచినీటి వసతి నిరుపేదలకు ప్రభుత్వ పరంగా అందే పథకాలు అందేలా కృషి చేస్తానని పంచాయతీ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని కల్పనా సునీల్ జా దవ్ హామీ ఇచ్చారు.
