Calendar 2026 | ఆంధ్రప్రభకు ప్ర‌త్యేక స్థానం

Calendar 2026 | ఆంధ్రప్రభకు ప్ర‌త్యేక స్థానం

  • క్యాలెండర్ ను ఆవిష్కరించిన తహసీల్దార్

Calendar 2026 | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రభ దినపత్రిక ప్రజల నిజాలను నిర్భయంగా రాస్తూ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం పొందుతుందని స్థానిక తహసీల్దార్ మొహమ్మద్ షబ్బీర్ అన్నారు. ఇవాళ‌ ఆంధ్రప్రభ నూతన సంవత్సర క్యాలెండర్ 2026(Calendar 2026)ను తహసీల్దార్ తన కార్యాలయంలో సిబ్బందితో కలిసి ఆవిష్కరణ చేశారు.

పలువురు అధికారుల సమక్షంలో క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం అభినందనీయమని తహసీల్దార్ షబ్బీర్ కొనియాడారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మొహమ్మద్ షబ్బీర్ మాట్లాడుతూ… కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన భీమ్‌గల్ ఆంధ్రప్రభ రూరల్ రిపోర్టర్ సయ్యద్ అత్తరుద్దీన్(Syed Attaruddin)ను ప్రత్యేకంగా అభినందించారు. ఎలాంటి భేషజాలకు తావులేకుండా…ఎవరికి తలొగ్గకుండా… ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా వార్తలు రాస్తూ అన్నివర్గాల ఆదరాభిమానాలు పొందుతున్న రిపోర్టర్ అత్తరుద్దీన్ ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు.

ఆంధ్రప్రభ దినపత్రిక 1938 ప్రారంభం నుండి ఇప్పటివరకు ప్రజాగొంతుకై నిలుస్తున్న ఆంధ్రప్రభ అన్ని వర్గాలకు అండగా నిలబడుతూ, వార్తలను వార్తలుగా పరిచరిస్తుందన్నారు. ఆంధ్రప్రభ దినపత్రిక అంటే తనకు ఎనలేని గౌరవమని, ఆ క్రమంలో క్యాలెండర్ తన చేతుల మీదుగా ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రభ(Andhraprabha) యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఎలక్షన్ డిటి అశ్విన్ బాబు, ఆర్ఐ లు సాయగౌడ్, మల్లేష్, స్వాతి, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాస్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ లు శివ, పల్లవి, హారిక, శారద, రజిత, అంజయ్య, శ్రీకాంత్ చిన్న సాహెబ్, రికార్డ్ అసిస్టెంట్ రాహుల్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply