Cabinet meeting | ఈ నెల 17న కేబినెట్‌ భేటీ..

Cabinet meeting | ఈ నెల 17న కేబినెట్‌ భేటీ..

  • కీలక అంశాలతో ఎజెండా
  • స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత
  • కోర్టుకు వివరాలు వెల్లడించే అవకాశం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 17న సాయంత్రం 3 గంటలకు తెలంగాణ కేబినెట్‌ భేటీ (Cabinet meeting) కానుంది. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ జరగనుంది. గిగ్‌ వర్కర్ల పాలసీకి కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. ఈ భేటీలో ప్రధానంగా 50 శాతం మించకుండా బీసీలకు పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు తెలుస్తోంది.

ఈనెల 24 లోగా ప్రభుత్వ నిర్ణయాన్ని తెలపాలని హైకోర్టు ఆదేశించగా.. మంత్రివర్గ సమావేశంలో చర్చించి కోర్టుకు తెలిపే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగే ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. జూబ్లిహిల్స్‌ ఉప ఎన్నికల్లో గెలుపు తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో ప్రభుత్వ పరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలిసింది.

Cabinet meeting

ఇందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయోత్సవాలు, ఇతర పలు అంశాలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. ప్రజల ఆమోదం ద్వారానే జూబ్లీహిల్స్‌ఎన్నిక ఫలితం వచ్చిందనే ఉద్దేశంతో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. వాస్తవంగా ఈనెల 7న కేబినెట్‌ సమావేశం జరగాల్సి ఉండగా, 12కు అని ఒకసారి, ఈనెల 15న మంత్రివర్గ భేటీ ఉంటుందనే ప్రచారం జరిగింది. వీటన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెట్టిన ప్రభుత్వం 17న మంత్రిమండలి భేటీకి నోట్‌ విడుదల చేసింది.

CM Revanth Reddy | నవీన్‌ యాదవ్‌ను పరిచయం చేశా..

Leave a Reply