అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు…

అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు…

విజయవాడ ఎంపీ కేశినేని శివనాద్ ( చిన్ని)
టిడిపి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం

విజయవాడ, ఆంధ్రప్రభ : అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. టిడిపి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ నేతృత్వంలో విజయవాడ శిఖమణి సెంటర్లో జరిగిన మాజీ దేశ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో ఎంపీ చిన్ని పాల్గొన్నారు. ముందుగా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి టీడీపీ ఎస్సీ సెల్ నాయకులతో కలిసి ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని) పూలమాలవేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కేసినేని చిన్ని మాట్లాడుతూ దేశ అభ్యున్నతిలో ఉప ప్రధానిగా, క్యాబినెట్ మంత్రిగా దేశానికి బాబు జగ్జీవన్ రామ్ అందించిన సేవలు మరువ లేనివన్నారు. పేదల అభ్యున్నతి కోసం, దళితుల హక్కుల సాధన కోసం శ్రమించిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్ళటమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

ఎమ్మార్పీఎస్ నాయకులతో సైతం కలిసి ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని) బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఎస్సీ సెల్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సొంగా సంజయ్ వర్మతో పాటుగా ఎస్సీ సెల్ నాయకులు దోమకొండ రవికుమార్, టిడిపి డివిజన్ అధ్యక్షులు సతీష్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎస్కే కరీముల్లా, టిడిపి నాయకులు మల్లెల రామకృష్ణ, ఎస్సీ సెల్ నాయకులు కూరపాటి దిలీప్, కె చౌటయ్య, రాము, ఎమ్మార్పీఎస్ నాయకులు ఎలీషా మాదిగ, సురేష్ మాదిగ, పి క్లైవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply