బిక్కనూర్, ఏప్రిల్ 10 (ఆంధ్రప్రభ) : బహిరంగ మార్కెట్లో దళారీ వ్యవస్థను అరికట్టేందుకే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ చెప్పారు. గురువారం బిక్కనూర్ మండల కేంద్రంలో సొసైటీ అధ్యక్షులు భూమయ్య ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ… రైతులు పండించిన పంటలకు కొనుగోలు కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధర కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతి రైతు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. వారం రోజుల్లోగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుందని గుర్తు చేశారు. వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు ఉపాధ్యక్షులు స్వామి, సొసైటీ ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేశం, మాజీ ఎంపీపీ గాల్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.