BUS STAND | త్వ‌ర‌గా పూర్తి చేయాలి

BUS STAND | త్వ‌ర‌గా పూర్తి చేయాలి

  • తెలంగాణా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి

BUS STAND | మంగపేట, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో నిర్మిస్తున్న బస్టాండ్ (Bus Stand) నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలంగాణా ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. బస్టాండ్ నిర్మాణ పనులను, బస్టాండ్ ఆవరణను ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి ఇవాళ‌ పరిశీలించారు. ఈసందర్భంగా ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి మాట్లాడుతూ… పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్ణీత గడువులోపు బస్టాండ్‌ ప్రారంభానికి మార్గం సుగమం చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

బస్టాండ్ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో కాకుండా నాసిరకంగా చేస్తున్నారని, ఈ విషయంపై పనులను పరిశీలిస్తున్న స్థానిక అధికారులను వివరణ అడుగుతుంటే పొంతన లేని సమాధానాలు చెపుతున్నారని మీడియా ప్రతినిధులు ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి (MD Y Nagireddy) దృష్టికి తీసుకెళ్లగా.. సంబంధిత అధికారులతో ఈ విషయంపై చర్చిస్తామని ఆయన తెలిపారు. ఆయన వెంట ఆర్టీసీ ఏఈ శ్రీహరి, మంగపేట ఎస్సై టీ.వీ.ఆర్.సూరి, ఆర్టీసీ విభాగానికి చెందిన సంబంధిత అధికారులు ఉన్నారు.

Leave a Reply