Bus Accident | భార్యాభర్తలు మృతి..

Bus Accident | భార్యాభర్తలు మృతి..
Bus Accident, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆర్టీసి బస్సు ఢీ కొనడంతో భార్యభర్తలు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధి వాహేద్ నగర్ ప్రధాన రోడ్డు పై జరిగింది. సూర్యాపేట జిల్లాకు చెందిన తిరుపతిరావు, వెంకటమ్మ దంపతులు ఇటీవల దిల్ షుక్ నగర్ లోని కొత్తపేటలో ఉంటున్న కుమార్తె వద్దకు వచ్చారు. ట్యాంక్ బండ్ చూసేందుకు ద్విచక్రవాహనం పై బయలుదేరారు.
అయితే.. మూసారాంబాగ్ హైటెక్ మోటర్స్ సమీపంలో వెనుక నుంచి స్పీడుగా వచ్చిన ఆర్టీసు బస్సు వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో దంపతులు రోడ్డు పై పడిపోయారు. బస్సు వెనుక టైరు వీరి పై నుంచి వెళ్లడంతో తిరుపతిరావు, వెంకటమ్మ అక్కడిక్కడే మృతి చెందారు. మలక్ పేట పోలీసులు ఘటనా స్థలంకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
