రాష్ట్ర బడ్జెట్లో గిరిజనులకు మొండి చెయ్యి…

రాష్ట్ర బడ్జెట్లో గిరిజనులకు మొండి చెయ్యి…
ఈనెల 25న గిరిజనుల అసెంబ్లీ ముట్టడి
లంబాడీ హక్కుల పోరాట సమితి డివిజన్ ఇంచార్జ్ రాథోడ్ రమేష్
జుక్కల్, ఆంధ్రప్రభ : అసెంబ్లీ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు మొండి చెయ్యి చూయించిందని లంబాడి హక్కులపోరాట సమితి బాన్స్ వాడ డివిజన్ ఇంచార్జ్ రాథోడ్ రమేష్ ఆరోపించారు.సోమవారం నాడు గిరిజన నాయకులతో కలిసి జుక్కల్ మండలంలోని అంబేద్కర్ చౌక్ వద్ద సోమవారంనాడు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
దీనికన్నా ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఎల్ హెచ్ పిఎస్ డివిజన్ ఇంచార్జి రాథోడ్ రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గిరిజనుల సంక్షేమం కోసం చేవెళ్ల డిక్లరేషన్ అమలుపలుస్తామన్న హామీని ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. సేవాలాల్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని గిరిజనుల చేస్తున్న డిమాండ్ ను తుంగలో తొకిందన్నారు.

దీంతోపాటు గిరిజన తాండలను ఇంకా రెవిన్యూ గ్రామాలుగా అమలుపరచలేదన్నారు. ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాల్లో నామమాత్రంగా బడ్జెట్ కేటాయించటం కంటి తుడుపు చర్యగా ఆయన అభివర్ణించారు. దీంతో గిరిజనులకు ఒరిగేది ఏమీ లేదన్నారు. గతంలో పోలిస్తే గిరిజనుల సంక్షేమాన్ని, అభివృద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరిచిపోయిందని, ఈబడ్జెట్ గిరిజనుల ఆర్థికఅభివృద్ధికి, వ్యాపారఅభివృద్ధికి, సమానత్వానికి, సంక్షేమానికి దోహదపడకుండా ఉంది కాబట్టి ఈనెల 25న గిరిజన అన్ని సంఘాలవారు సమిష్టిగా నగర భేరి పేరుతో అసెంబ్లీని ముట్టడించడం జరిగి జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు ఆకాష్ నాయక్, జైపాల్ నాయక్, పవన్ నాయక్, రాం దాస్, రాజు నాయక్, శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.
