Budget | రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చ

Budget | రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చ
Budget | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా పార్టీ అధిష్ఠానంతో కీలక సమావేశాలు జరుపుతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఆయన విడివిడిగా భేటీ అయ్యారు.
ఖర్గేతో దాదాపు గంటపాటు జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రతిపక్షాల తీరు వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ చీఫ్ విప్ పదవుల నియామకాలపై సీఎం అధిష్ఠానంతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దిగిన వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ హర్షం వ్యక్తం చేశారు.
