BSEAP | టెన్త్ హాల్ టికెట్లు విడుదల

BSEAP | టెన్త్ హాల్ టికెట్లు విడుదల
ఈ నెల 16 నుంచి పరీక్షలు
BSEAP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్థులు https://www.bse.ap.gov.in/ సైట్ లేదా మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009, లీప్ యాప్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) పదో తరగతి హాల్ టికెట్లను అధికారికంగా విడుదల చేసింది. ఇకపై విద్యార్థులు హాల్ టికెట్ల (Hall tickets) ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈనెల 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, హాల్ టికెట్లు విడుదలతో విద్యార్థులు, తల్లిదండ్రులలో ఆందోళన కొంత తగ్గినట్లు కనిపిస్తోంది.
హాల్ టికెట్లు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
అధికారిక వెబ్‌సైట్: https://www.bse.ap.gov.in/
మన మిత్ర వాట్సాప్ నంబర్: 9552300009
లీప్ యాప్ ద్వారా కూడా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు తమ హాల్ టికెట్లు తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకుని, పరీక్షా కేంద్రం, రోల్ నంబర్ వంటి వివరాలు సరిచూసుకోవాలని BSEAP అధికారులు సూచించారు.
