BRS | వందల ఎకరాలను తన్నుకుపోతున్నారు..

BRS | వందల ఎకరాలను తన్నుకుపోతున్నారు..
దళితుల భూముల స్కామ్ విలువ రూ.7 వేల కోట్లు
బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు
BRS | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే కాంగ్రెసోళ్లు కబ్జాల పర్వానికి తెర లేపారని ఆరోపించారు. దళితుల భూములను గద్దల్లా తన్నుకుపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాదర్‌గుల్‌లో రూ.7 వేల కోట్ల విలువైన 373 ఎకరాల ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం మింగేసిందన్నారు. కాంగ్రెస్ హయాంలో దళితుల భూముల స్కామ్ విలువ రూ.7 వేల కోట్లని ఆయన అన్నారు.
నాదర్‌గుల్ భూముల స్కామ్‌లో ప్రభుత్వ పెద్దలు భాగస్వాములేనని, వైఎస్ డిక్లేర్ చేసిన ప్రభుత్వ భూములను కేసీఆర్ కాపాడితే.. రేవంత్ భక్షిస్తున్నారని ఆయన మండిపడ్డారు. నాదర్‌గుల్ భూములను కాపాడేందుకు హైడ్రా ఎందుకు రావట్లేదని హరీశ్ రావు ప్రశ్నించారు. హైకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ అధికార బలంతో బౌన్సర్లను పెట్టి పేద రైతులపై దాడులు చేయిస్తున్నారు. ఈ భారీ భూ కుంభకోణం, కబ్జా కంపెనీల వెనుక ఉన్నది సాక్షాత్తూ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి కుటుంబమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు .
పేదల ఇళ్లు కూలగొట్టే ‘హైడ్రా’కు .. అధికార పార్టీ నేతల వేల కోట్ల కబ్జాలు, చెరువుల ఆక్రమణలు ఎందుకు కళ్లు కనిపించదు సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే కబ్జాదారులను అరెస్ట్ చేసి, రైతులను భూముల్లోకి అనుమతించాలి. నాదర్‌గుల్ భూములపై రేపు ఉదయం వరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్యలు తీసుకోకపోతే.. ఎమ్మెల్యేలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వెళ్తామనన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులు, బలహీన వర్గాల భూములను అధికార పార్టీ పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ఒకవైపు పారిశ్రామిక వేత్తల ముసుగులో, మరోవైపు కబ్జాల రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక భూ కుంభకోణాలకు పాల్పడుతోందన్నారు.
