BRS : పార్టీ విప్‌లుగా కె.పి.వివేకానంద, సత్యవతి రాథోడ్

తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్‌లను ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. శాసనసభలో బీఆర్ఎస్ విప్‌గా కె.పి.వివేకానంద గౌడ్, మండలిలో విప్‌గా సత్యవతి రాథోడ్‌ను నియమించారు. కేసీఆర్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.టి.రామారావు, పార్టీ ఇతర నేతలు సభాపతికి తెలియజేశారు.

ఈ మేరకు నియామక పత్రాలను సభాపతికి అందజేశారు. కె.పి.వివేకానంద గౌడ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో తెలుగుదేశం పార్టీ నుండి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018, 2023లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *