పేదింటి బిడ్డను ప్రజాసేవకు వస్తున్న ఆశీర్వదించండి

మంథని, ఆంధ్రప్రభ : పేదింటి బిడ్డను పదవుల ఆశించి కాదు ప్రజాసేవకు వస్తున్న ఆశీర్వదించాలని పుప్పాల తిరుపతి ఓటర్లను కోరారు. మంథని మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు తరఫున బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి పుప్పాల తిరుపతి ప్రచారంలో రాకెట్ లా దూసుకవెళ్తున్నారు. మోసపోవద్దు, గోసపడతాం అనే నిదానంతో ప్రతి గడపగడపకు అయన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గతంలో ప్రజాసేవ చేసిన అనుభవం ఆయనకు కలిసొచ్చే అంశం. ఈసారి ఖచ్చితంగా మంథని మున్సిపల్ పోరులో పుప్పాల తిరుపతి విజయం పక్కా అని వార్డు ప్రజలే ఆయన తరపున ప్రచారం చేస్తున్నారు.

గెలిచిన తర్వాత పాలకుడిగా కాకుండా ప్రజాసేవకుడిగా పరిపాలనందించడంలో ముందు ఉంటానని ఆయన ప్రతిజ్ఞ చేస్తున్నారు. ప్రతి ఒక్కరి సమస్యను సానుకూలంగా వింటూ ఆత్మీయంగా పలకరిస్తూ ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఆయన ప్రచారానికి ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సహకారంతో మంథని పురపాలక ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ప్రతి ఒక్కరు ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటెయ్యాలని ఆయన కోరారు. కారు గుర్తు ఓటు వేస్తే కష్టం రాకుండా పరిపాల అందించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇస్తున్నారు.

వార్డు ప్రజలలో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించడంలో ప్రత్యేక కార్యచరణ చేపడతానని ఆయన తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ, సురక్షితమైన మంచినీరు అందించడంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తానని ఆయన తెలిపారు. ఒక్కసారి అవకాశం కల్పించాలని ఐదు సంవత్సరాలు ప్రజాసేవ కోసం పాటుపడతానని ఆయన పేర్కొన్నారు. కారు గుర్తుకు ఓటు ఇస్తే, రక్షణ కవచంలా పరిపాలన అందిస్తానని ఆయన తెలిపారు. ఆయన చేస్తున్న ప్రచారానికి వస్తున్న మద్దతు చూస్తుంటే ఆయన గెలుపు ఖాయమని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. పుప్పాల తిరుపతి లాంటి వ్యక్తిని గెలిపించుకుంటే మనలో ఒకరిగా పరిపాలన అందిస్తారని ప్రజలంతా భావిస్తున్నారు.

Leave a Reply