బీఆర్ఎస్ జైత్యయాత్ర షురూ : కేటీఆర్

బీఆర్ఎస్ జైత్యయాత్ర షురూ : కేటీఆర్
హైదరాబాద్, ఆంధ్రప్రభ పొలిటికల్ బ్యూరో : జూబ్లీహిల్స్(Jubilee Hills By-Election) బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత(Maganti Sunitha) నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు షేక్‌పేట్ తహసీల్దార్ ఆఫీస్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సహా పలువురు ముఖ్య నేతలతో వెళ్లి తొలి సెట్ నామినేషన్ వేశారు.
దివంగత మాగంటి గోపీనాథ్ భార్య సునీతను బీఆర్ఎస్(BRS) అధిష్ఠానం టికెట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నామినేషన్(Nomination) కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు పద్మారావు, రావుల శ్రీధర్‌రెడ్డి, దీదీప్య రావు, విష్ణువర్ధన్‌రెడ్డి, రాజ్‌కుమార్ పటేల్ పాల్గొన్నారు.
అభివృద్ధి, అరాచకం మధ్య పోటీ
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్(Maganti Sunitha) నామినేషన్ కోసం బయల్దేరారు. నామినేషన్ వేయడానికి వెళ్లేముందు తెలంగాణ భవన్‌లో కేటీఆర్(KTR) మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో జరుగుతున్న ఎన్నిక పార్టీల మధ్య జరిగే ఎన్నిక కాదు.. పదేండ్ల అభివృద్ధి పాలనకు, రెండేండ్ల అరాచక పాలనకి మధ్య జరుగుతున్న ఎన్నిక అని అన్నారు.
కాంగ్రెస్ చేతిలో మోసపోయిన కు ఈ ఎన్నిక ఒక అవకాశంగా భావిస్తున్నారని అన్నారు. మరోసారి రాష్ట్రంలో గులాబీ పార్టీ జైత్రయాత్ర జూబ్లీహిల్స్(Jubilee Hills) నుంచే ప్రారంభం కాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల మద్దతుతో, అండతో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ఘన విజయం సాధిస్తారన్నారు.

