BRS | ఆదర్శ గ్రామం చేస్తా..

BRS | ఆదర్శ గ్రామం చేస్తా..

BRS, నెల్లికుదురు, ఆంధ్రప్రభ : నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మ్మణ కొత్తపల్లి గ్రామ సర్పంచ్ గా తమను గెలిపిస్తే.. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుతానని బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి చిర్ర యాకంతం గౌడ్ అన్నారు. గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అభ్యర్థగా బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన తనను అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే గ్రామాల అభివృద్ధి జరిగిందన్నారు.

గ్రామంలో ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు ఎలాంటి లోటు రాకుండా నిత్యం గ్రామంలోనే వుంటూ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తానన్నారు. గత ఐదు సంవత్సరాలు గ్రామ ఉప సర్పంచ్ గా వుండి గ్రామానికి కావలిసిన అనేక మౌలిక వసతులను సొంత ఖర్చులతో కూడా చేశామన్నారు. తనతో పాటు, అన్ని వార్డుల అభ్యర్థులను అధిక మెజారిటితో గెలిపించాలని ప్రజలను కోరారు.

Leave a Reply