BRS IN 2028 | రేవంత్ రెడ్డిని ఫుట్‌బాల్ ఆడుకుంటా..

BRS IN 2028 | రేవంత్ రెడ్డిని ఫుట్‌బాల్ ఆడుకుంటా..

  • హనీమూన్ పీరియడ్ ముగిసింది..
  • రంగంలోకి కేసీఆర్
  • బీజేపీతో చీకటి స్నేహం చేసేది రేవంత్ రెడ్డినే
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

BRS IN 2028 హైదరాబాద్, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరితో ఫుట్‌బాల్ ఆడుకుంటారో తనకు తెలియదు కానీ, తాను మాత్రం రేవంత్ రెడ్డిని ఫుట్‌బాల్ ఆడుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ముగిసిందని, ఇకపై కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని ఆయన ప్రకటించారు.

శనివారం బీఆర్ఎస్ భవన్‌లో కేటీఆర్ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. రాజకీయాల్లో హుందాతనం ముఖ్యమని.. రేవంత్ రెడ్డి మాదిరిగా తాను దిగజారి మాట్లాడనని అన్నారు. రేవంత్ ఇంట్లో మహిళలు, పిల్లలు, మనమడి గురించి తాను మాట్లాడనని తెలిపారు.

రేవంత్ రెడ్డి లాగా… కుటుంబ సభ్యుల విషయంలో చిల్లర రాజకీయాలు చేయడం త‌న‌ సంస్కారం కాదు అని కేటీఆర్ పేర్కొన్నారు. 21న తెలంగాణ భవన్‌లో జరగబోయే సమావేశంలో తమ అధినాయకుడు కేసీఆర్ అన్ని విషయాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని, బహిరంగ సభల నిర్వహణపై కూడా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం పార్టీ మెంబర్‌షిప్ ప్రక్రియ ఉంటుందని తెలిపారు. 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం పక్కా అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

BRS IN 2028 | రేవంత్‌రెడ్డి వ్యవహారశైలి కిట్టీ పార్టీ ఆంటీలా ఉంది…

BRS IN 2028
BRS IN 2028

రేవంత్ రెడ్డి వ్యవహారశైలి జూబ్లీహిల్స్ కిట్టీ పార్టీ ఆంటీ మాదిరిగా ఉందని కేటీఆర్ విమర్శించారు. ఫార్ములా రేస్, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఏమీ లేదని రేవంత్‌కు అర్థమైందని, అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసును అంతులేని కథలా నడిపిస్తున్నారని అన్నారు.

గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా చేయాలనే ఆలోచనతో రేవంత్ ఉన్నారని, చిన్న మున్సిపాలిటీలను పెద్ద వాటిలో కలిపితే సమస్యలు వస్తాయని తమ నేతలు ఇప్పటికే అభ్యంతరం తెలిపారని చెప్పారు. ముషీరాబాద్ నియోజకవర్గ విభజనలో అస్పష్టత ఉందని విమర్శించారు.

రేవంత్ రెడ్డి దెబ్బకు రాష్ట్రం నుంచి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతున్నాయని, విరూపాక్ష అనే కంపెనీ కర్నూలుకు వెళ్లిపోయిందని కేటీఆర్ వెల్లడించారు. ప్రభుత్వం సోయా కొనలేని స్థితిలో ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీష్ రావు క్యూర్, క్యూర్ చోర్ అని సరిగ్గా అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు.

BRS IN 2028 | ఒక కాలు కాంగ్రెస్‌లో మరోకటి బీజేపీలో…..

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పడానికి రేవంత్ ఎవరు? తాము పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతం, అసెంబ్లీ ఎన్నికల్లో 30 శాతం సీట్లు బీసీలకు ఇచ్చామని కేటీఆర్ గుర్తు చేశారు.

మార్కెట్ యార్డుల్లో బీసీలకు పదవులు ఇచ్చింది తామేనని తెలిపారు. విద్యా, ఉపాధిలో రిజర్వేషన్లు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఒక కాలు కాంగ్రెస్‌లో, మరొక కాలు బీజేపీలో ఉందని కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీలో బీజేపీ ఎంపీ దుబే గృహప్రవేశానికి రేవంత్ ఎందుకు వెళ్లారు? తుగ్లక్ రోడ్డులో రేవంత్ ఇల్లు రీమోడల్ చేయించింది బీజేపీ ఎంపీయే అని ఆరోపించారు.

ఏపీకి చెందిన ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో రేవంత్ విందులు, వినోదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సీఎం రమేష్‌కే కాంట్రాక్టులు ఇస్తున్నారు. బీజేపీతో చీకటి స్నేహం చేసేది రేవంత్ రెడ్డి మాత్రమేనని దుయ్యబట్టారు.

అఖిలేష్ యాదవ్ తమ పాత మిత్రుడని, ఆయనతో సఖ్యతగా ఉంటే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకు బాధ ఎందుకని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి వల్ల ఎవరికీ లాభం లేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా అదనంగా తేలేని కిషన్ రెడ్డితో మాకేం లాభం ఉంటుందని ప్రశ్నించారు.

ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, సమయం కోసం ఎదురుచూస్తున్నారు. రేవంత్ రెడ్డి తన నోటిని అదుపులో పెట్టుకోవాలి. అసెంబ్లీ సాక్షిగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఏమీ కాదని చెప్పి, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మాట మారుస్తున్నారు. ఈ ద్వంద్వ నీతిని ప్రజలు క్షమించర‌ని కేటీఆర్ అన్నారు.

click here to read శాంతి, ప్రేమ మార్గంలో ప్ర‌జాపాలన..

click here for more

ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, సమయం కోసం ఎదురుచూస్తున్నారు. రేవంత్ రెడ్డి తన నోటిని అదుపులో పెట్టుకోవాలి. అసెంబ్లీ సాక్షిగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఏమీ కాదని చెప్పి, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మాట మారుస్తున్నారు. ఈ ద్వంద్వ నీతిని ప్రజలు క్షమించర‌ని కేటీఆర్ అన్నారు.ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, సమయం కోసం ఎదురుచూస్తున్నారు. రేవంత్ రెడ్డి తన నోటిని అదుపులో పెట్టుకోవాలి. అసెంబ్లీ సాక్షిగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఏమీ కాదని చెప్పి, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మాట మారుస్తున్నారు. ఈ ద్వంద్వ నీతిని ప్రజలు క్షమించర‌ని కేటీఆర్ అన్నారు.ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, సమయం కోసం ఎదురుచూస్తున్నారు. రేవంత్ రెడ్డి తన నోటిని అదుపులో పెట్టుకోవాలి

అసెంబ్లీ సాక్షిగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఏమీ కాదని చెప్పి, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మాట మారుస్తున్నారు. ఈ ద్వంద్వ నీతిని ప్రజలు క్షమించర‌ని కేటీఆర్ అన్నారు.ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, సమయం కోసం ఎదురుచూస్తున్నారు. రేవంత్ రెడ్డి తన నోటిని అదుపులో పెట్టుకోవాలి. అసెంబ్లీ సాక్షిగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఏమీ కాదని చెప్పి, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మాట మారుస్తున్నారు. ఈ ద్వంద్వ నీతిని ప్రజలు క్షమించర‌ని కేటీఆర్ అన్నారు.ప్రజలు అన్నీ గమనిస్తున్నారు,

సమయం కోసం ఎదురుచూస్తున్నారు. రేవంత్ రెడ్డి తన నోటిని అదుపులో పెట్టుకోవాలి. అసెంబ్లీ సాక్షిగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఏమీ కాదని చెప్పి, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మాట మారుస్తున్నారు. ఈ ద్వంద్వ నీతిని ప్రజలు క్షమించర‌ని కేటీఆర్ అన్నారు.ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, సమయం కోసం ఎదురుచూస్తున్నారు. రేవంత్ రెడ్డి తన నోటిని అదుపులో పెట్టుకోవాలి. అసెంబ్లీ సాక్షిగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఏమీ కాదని చెప్పి, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మాట మారుస్తున్నారు. ఈ ద్వంద్వ నీతిని ప్రజలు క్షమించర‌ని కేటీఆర్ అన్నారు.

Leave a Reply