భారీ మెజారిటీతో గెలిపించండి..

భారీ మెజారిటీతో గెలిపించండి..
- 12వ వార్డు అభివృద్ధి కోసం బిఆర్ఎస్ అభ్యర్థి మోయిజ్ హుస్సేన్
మక్తల్ , ఆంధ్రప్రభ : మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో 12వ వార్డు నుండి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎండి.మోయిజ్ హుస్సేన్ ను ఆశీర్వదించి అండగా నిలిచి భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన బిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా వార్డు పరిధిలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ఎండి.మోయిజ్ హుస్సేన్ ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేళ్లలో తాను చేపట్టిన అభివృద్ధి తప్ప రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమాత్రం లేదన్నారు .మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా ఎలాంటి అభివృద్ధి చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు.
