ఇంటింటి ప్రచారంలో వెల్లువెత్తుతున్న మద్దతు

మంథని, ఆంధ్రప్రభ : మంథని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి పూదరి లావణ్య సాగర్ తన ప్రచారంతో వార్డును హోరెత్తిస్తున్నారు. తన అనుచరులు, పార్టీ శ్రేణులతో కలిసి వార్డులోని ప్రతి గడపను పలకరిస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరించారు. ఈ సందర్భంగా మహిళా ఓటర్లు ఆమెకు మంగళహారతులతో ఘనస్వాగతం పలకడం విశేషం. ప్రజా సేవయే పరమావధి ప్రచారంలో భాగంగా లావణ్య సాగర్ మాట్లాడుతూ.. వార్డులోని మౌలిక వసతుల కల్పనకు తాను ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. డ్రైనేజీ సమస్యలు, తాగునీరు, సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసి 12వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ మార్గదర్శకత్వంలో, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ పుట్ట శైలజ సహకారంతో వార్డును మరింత అభివృద్ధి చేస్తానని ఓటర్లకు భరోసా ఇచ్చారు. ఏకపక్షంగా లావణ్య సాగర్ వైపు మొగ్గు చూపుతుండటంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Leave a Reply