38th National Games | తెలంగాణ ఆర్చరి జట్టుకు కాంస్యం..
38వ జాతీయ క్రీడల్లో తెలంగాణ మహిళల ఆర్చరీ జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన మహిళల కంపౌడ్ ఈవెంట్‌లో చికిత, మానస నైనా, మన్సూరా హసీబా, శ్రేష్టలతో కూడిన తెలంగాణ ఆర్చర్ల జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం గెలుచుకుంది.
ఈ మెడల్‌తో జాతీయ క్రీడల్లో తెలంగాణ పతకాల సంఖ్య నాలుగు చేరింది. అంతకుముందు మహిళల 3-3 బాస్కెట్‌బాల్ ఈవెంట్‌లో తెలంగాణ అమ్మాయిలు బంగారు పతకం గెలుచుకోగా.. సైక్లింగ్, షూటింగ్ పోటీల్లో తెలంగాణకు కాంస్య పతకాలు లభించాయి. అలాగే బీచ్ వాలిబాల్ ఈవెంట్‌లో తెలంగాణ మహిళల జట్టు సెమీఫైనల్లో ప్రవేశించింది.
ఆర్చరీ మిక్స్‌డ్ ఈవెంట్‌లో ఏపీకి రజతం..
మరోవైపు, పురుషుల వ్యక్తిగత ఆర్చరీ ఈవెంట్‌లో ఏపీ నాయుడుపేటకు చెందిన తిరుమూరు గణేష్ మణిరత్నం కాంస్య పతకాన్ని సాధించగా, కృష్ణా జిల్లా నాగాయలంకకు చెందిన నాగిడి గాయత్రి మహిళల (కె-1) ఈవెంట్‌లో స్వర్ణం సాధించింది.
మిక్స్‌డ్ కాంపౌండ్ ఆర్చరీ ఈవెంట్‌లో భీమవరానికి చెందిన సూర్య హంసిని, నాయుడుపేటకు చెందిన మణిరత్నం కలిసి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు.