కాంస్య పథకాలను అందుకున్న అక్షిత, శ్రీ గణేష్

కాంస్య పథకాలను అందుకున్న అక్షిత, శ్రీ గణేష్
రాష్ట్రస్థాయి మల్కంబు పోటీలో కాంస్య పథకాలు గెలుచుకున్న ట్రినిటీ విద్యార్థులు
చౌటుప్పల్, ఆంధ్రప్రభః యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని ట్రినిటీ హైస్కూల్ విద్యార్థులు కత్తి అక్షిత, శ్రీ గణేష్ లు హైదరాబాద్ సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో శుక్ర, శని వారాలలో జరిగిన సీఎం కప్ 2026 సెకండ్ ఎడిషన్ మల్కంబు రాష్ట్రస్థాయి పోటీలలో మూడో స్థానం సాధించి కాంస్య పథకాలు గెలుచుకున్నారు. ఈ పోటీలలో 16 జిల్లాల నుంచి మల్కంబు క్రీడాకారులు పాల్గొన్నారు. విజేత లకు ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి, జిల్లా యువజన స్పోర్ట్స్ అధికారి వెంకటేశ్వర్లు చేతుల మీదుగా పథకాలను అందజేశారు. పథకాలు సాధించిన విద్యార్థులను ట్రినిటీ హైస్కూల్ చైర్మన్ కెవిబి కృష్ణారావు, స్కూల్ డైరెక్టర్ కం ప్రిన్సిపాల్ డాక్టర్ ఉజ్జీని మంజుల అభినందించారు. విద్యార్థులకు ఉత్తమ శిక్షణ ఇచ్చిన పీఈటీ లు కిరణ్ కుమార్, గోపాల్, హారతి లను అభినందించారు.

