Bridge | గాలిలో కలిసిన 6 గ్యారంటీలు…
- కాంగ్రెస్ పాలనలో పల్లెలు అభివృద్ధిలో వెనుకబడ్డాయి
- పల్లెలు పచ్చగా ఉండాలంటే బిఆర్ఎస్ ప్రభుత్వం రావాలి
- సర్పంచ్ అభ్యర్థి అనవేన సృజన రమేష్ ల ఉంగరం గుర్తు పై ఓటు వేసి గెలిపించాలి
Bridge | టేకుమట్ల, ఆంధ్రప్రభ : బీఆర్‌ఎస్ హయాంలో గ్రామాలు, పట్టణాలు అన్ని రంగాల్లో అభివృద్ధి(Development) చెందాయని, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో పల్లెలు, పట్టణాలు అభివృద్ధిలో వెనుకబడిపోయాయని మాజీ స్పీకర్, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ఇవాళ ఆయన భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావు పల్లి గ్రామంతో పాటు పలు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేస్తూ సుడిగాలి పర్యటన చేశారు.
వృద్ధులు, మహిళలతో ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పాలన తీరును అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో పల్లెలు పచ్చగా ఉండేవని, నేడు ఎక్కడ చూసినా చెత్తాచెదారం నిండిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.
మాజీ సర్పంచ్ ఎకు మల్లేష్ మీ ఊరు అభివృద్ధి కోసం నా వెనుక ఉండి కొట్లాడి వెంకట్రావుపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేశాడని గుర్తు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో(Panchayat elections) భాగంగా బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ ప్రచారం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో గ్రామాభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని.
ఏం పేడు బోర్నపల్లి గ్రామాల మధ్యలో బ్రిడ్జి(Bridge) నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా బోర్నపల్లి కిష్టంపేట మధ్యలో బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మరోసారి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రావాలని, అందుకు ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి సృజన రమేష్ ల ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించి కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలన్నారు.

