సంగారెడ్డి .. పాశమైలారం పారిశ్రమికవాడలో మరో అగ్నిప్రమాదం (fire accident) నేడు చోటు చేసుకుంది.. ఎన్వీరో వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో ఈ ఘటన చోటు చేసుకుంది . ఆస్పత్రుల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ (recycling ) చేస్తున్న పరిశ్రమలో (industry ) జరిగిన ఈ ప్రమాదంపై విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది (fire safety staff )అక్కడికి చేరుకున్నారు.

ప్రస్తుతం.. మంటలను ఆర్పుతున్నారు అగ్నిమాపక సిబ్బంది.. ఈ అగ్నిప్రమాదంలో లారీ, జెసిపి లు కాలపోయాయి. ఎటువంటి ప్రాణనష్టం కలుగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పరిశ్రమ పరిసరాల్లో దట్టంగా పొగ అలుముకోవడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు.. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
