ఘనంగా వెంటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు..

ఘనంగా వెంటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు..

  • కోలాహలంగా వెంకన్న,అలివేలు మంగమ్మల ప్రతిమల ఊరేగింపు

హసన్ పర్తి, ఆంధ్రఫ్రభ: హన్మకొండ… కరీంనగర్ ప్రదాన రహదారిలోని హసన్ పర్తి మండల కేంద్రంలోమహిమాన్వితుడు వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ధ మంగళవారం ఉదయం భక్తుల సందడితో కోలాహలంగా నెలకొంది.ఎర్రగట్టు వద్ద కొనసాగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా హసన్ పర్తిలోని ఆలయంలో వెంటేశ్వరస్వామి, అలివేలు మంగమ్మల ప్రతిమలకు పూజారులు వేదమంత్రోచ్చారణలతో పూజలు నిర్వహించారు.

అనంతరం కోరినవారికి కోరికలు తీర్చే కొంగుబంగారంగా వరాలనిచ్చే దేవత ప్రతిమలను పెద్ద రథ చక్రం బండిపై ఉంచి, ఊరేగింపును కొనసాగించారు ప్రతి ఏటా మార్చి హెూళీ ఫాల్గుణ పౌర్ణమి రోజున ప్రారంభమై ఐదు రోజుల పాటు కొనసాగుతుంది.అయితే జాతర ఉత్సవ వేడుకలను పురస్కరించుకొని హాసన్ పర్తి దేవాలయం నుంచి వెంకన్న, అలివేలు మంగమ్మల ఉత్సవమూర్తుల విగ్రహ ప్రతిమలతో ఊరేగింపుగా గుట్టకు చేరుకోవడంతో జాతర వేడుకలు ప్రారంభమవుతాయి.

కానీ ఈసారి చంద్రగ్రహణం ఉండడం వలన కళ్యాణ మహోత్సవం నిర్వహించడం లేదు.హసన్ పర్తి దేవాలయం నుండి ప్రారంభమైన దేవతా మూర్తుల ప్రతిమల ఊరేగింపు ప్రదాన రహదారిలో కొనసాగడంతో భక్తుల సందడి కొనసాగింది.తండోపతండాలుగా భక్తులు పెద్ద రథం చక్రాల బండికి ఎదురేగి, దేవతా మూర్తులకు కొబ్బరికాయలు కొట్టి, కానుకలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఎర్రగట్టు వెంకన్నా కోటి దండాలంటూ భక్తులు తాళ్ళతో కట్టిన రథాన్ని లాగుతూ ప్రదాన రహదారులలో ఊరేగించారు. అనంతరం ఎర్రగట్టు దేవాలయానికి దేవతా ప్రతిమలను చేర్చారు.

గ్రహణ మూలంగా బుదవారం ఉదయం దేవతా ప్రతిమలకు పూజలు నిర్వహించిన అనంతరం ప్రతిష్టించడంతో అట్టహసంగా జాతర ప్రారంభమవుతుంది. ఈబ్రహ్మోత్సవాల ర్యాలీలోస్థానిక కార్పోటర్ గురుమూర్తి శివకుమార్, 66వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కనపర్తి కిరణ్, మండల కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ బిగుళ్ళ సురేష్ లతో పాటు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు,భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక సీఐ వట్టే చేరాలు తన సిబ్బందితో బారీ బందోబస్త్ ను ఏర్పాటు చేశారు.

Leave a Reply