Boyapati | ఆ మూవీ సీక్వెల్ చేయబోతున్నాడా..?

Boyapati | ఆ మూవీ సీక్వెల్ చేయబోతున్నాడా..?
Boyapati | అఖండ 2 తర్వాత బోయపాటి నెక్ట్స్ మూవీపై సస్పెన్స్
అల్లు అర్జున్‌కు కథ చెప్పిన బోయపాటి
రానాతో సినిమా చేస్తాడా..? అనే చర్చ
బాలీవుడ్ లో జాట్ సీక్వెల్ తెరకెక్కించే ప్లాన్
మాస్ ఆడియన్స్ ను మెప్పించేలా బోయపాటి ప్లాన్
Boyapati | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి (Director Boyapati) తెరకెక్కించిన అఖండ 2 సినిమా రిలీజై మూడు నెలలు అవుతుంది కానీ.. ఇంత వరకు కొత్త సినిమాని అనౌన్స్ చేయలేదు. మరి.. బోయపాటి సినిమా ఎవరితో అంటే ఒకరిద్దరి హీరోల పేర్లు వినిపించాయి. ఇప్పుడు కొత్తగా మరో హీరో పేరు వినిపిస్తుంది. విచిత్రంగా వేరే డైరెక్టర్ తెరకెక్కించిన మూవీ సీక్వెల్ ని బోయపాటి చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇంతకీ.. ఏ సినిమా సీక్వెల్ చేయబోతున్నారు..? అసలు బోయపాటి ప్లాన్ ఏంటి..?
Boyapati | బన్నీకి కథ నచ్చింది కానీ..
అఖండ 2 బ్లాక్ బస్టర్ అయ్యుంటే.. వేరేలా ఉండేది. అనుకున్న టైమ్ కి రిలీజ్ కాకపోవడం.. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో.. బోయపాటి నెక్ట్స్ సినిమా (Movie) ఎవరితో అనేది సస్పెన్స్ గా మారింది. ఆమధ్య బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ తో బోయపాటి సినిమా అంటూ ప్రచారం జరిగింది. ముంబాయి వెళితే.. రణ్ వీర్ సింగ్ కోసం వెళ్లారు అనుకున్నారు కానీ.. అక్కడకు వెళ్లి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కథ చెప్పారు. కథ నచ్చింది కానీ.. బన్నీ బిజీగా ఉండడం వలన ఈ కాంబో మూవీ సెట్ అయినా సెట్స్ పైకి రావడానికి టైమ్ పడుతుంది.

Boyapati | బాలీవుడ్ లో బోయపాటి..
బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ తో సెట్ కాలేదు. బన్నీతో ఇప్పట్లో కుదిరేలా లేదు. మరి.. ఎవరితో అంటే.. రానా దగ్గుబాటి పేరు వినిపించింది. రానా కూడా ఎప్పటి నుంచో భారీ సినిమా చేయాలి అనుకుంటున్నారు. అందుచేత ఈ కాంబోలో మూవీ దాదాపు ఫిక్స్ అంటూ రీసెంట్ గా ఇండస్ట్రీలో వినిపించింది. అయితే.. ఇప్పుడు ఊహించని విధంగా బోయపాటి బాలీవుడ్ (Bollywood) లోనే సినిమా చేయబోతున్నారని.. అది జాట్ మూవీ సీక్వెల్ అని వార్తలు వస్తున్నాయి. జాట్ మూవీని బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ తో టాలీవుడ్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ తెరకెక్కించారు. ఈ సినిమా మాస్ జనాలకు బాగా నచ్చింది.

Boyapati | ఊర మాస్ జనాలు మెచ్చేలా..
ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. అయితే.. మలినేని గోపీచంద్ బాలయ్యతో సినిమా చేస్తున్నారు. దీంతో జాట్ సీక్వెల్ ఇప్పట్లో ఉండదేమో.. అసలు ఈ ప్రాజెక్టే ఉండదేమో అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించింది. కానీ.. మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసినట్టుగా సీక్వెల్ (sequel) తీయాలి అనుకుంటున్నారట. ఇప్పుడు బోయపాటితో ప్లాన్ చేస్తున్నారట. ఆయన అయితే.. ఊర మాస్ జనాలకు మరింతగా నచ్చేలా తీస్తారనే టాక్ ఉంది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి ఏర్పడింది. అయితే.. ఇది నిజమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.

