ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో పట్టణాలు, గ్రామాల్లో వీధి కుక్కలు(Stray dogs) హల్‌చల్ చేస్తున్నాయి. గ్రామ పురవీధుల్లో వీరంగం సృష్టిస్తున్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా వీధి కుక్కలు గుంపుల(groups)గా దాడి చేస్తున్నాయి. ఈ దాడిల్లో జనాలకు తీవ్ర గాయాల పాలవుతున్నారు. కొంత మంది అక్కడికక్కడే మృతి చెందుతున్న సంఘటనలు సోషల్ మీడియాలో రోజు రోజుకు ఎక్కడో ఒక చోట జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనే గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
పొన్నూరు మండలం వెల్లలూరు గ్రామానికి చెందిన తాడిశెట్టి రాజా(Tadisetti Raja), జ్యోతి(Jyoti) దంపతులకు కుమారుడు కార్తీక్(4) వీధికుక్క దాడిలో మృతి చెందాడు. 15 రోజుల క్రితం బాలుడు ఇంటి బయట ఆడుకుంటు ఉండగా.. వీధికుక్క దాడి చేసింది. దాడిలో తల, చేతులపై తీవ్ర గాయాలు కావడంతో పొన్నూరు ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ..
చికిత్స చేస్తుండగా.. మూడు రోజులకు బాలుడిలో మార్పు కనిపించడంతో విజయవాడ(Vijayawada)లో ఓ ప్రైవేట్ ఆస్పత్రి(Private hospital)కి తరలించారు. వైద్యపరీక్షలు చేసిన వైద్యులు.. బాలుడికి రేబిస్(Rabies) సోకినట్లు నిర్థారించారు. అప్పటి నుంచి చికిత్స చేస్తున్నా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో.. గుంటూరు జీజీహెచ్(Guntur GGH) కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న బాలుడు.. ఆరోగ్యం మరింత విషమించి మరణించాడుః. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలుడి మరణంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

