రుతువులు మారినప్పుడు మన ఆరోగ్యంపై వాటి ప్రభావం తప్పదనే చెప్పాలి. ఉష్ణోగ్రతల మార్పులు, అలర్జీలు, జీవనశైలిలో వచ్చే తేడాలు ఇవి అన్ మననీ రోగనిరోధక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతాయి. దీని వల్ల జలుబు, ఫ్లూ, అలసట వంటి సమస్యలు తలెత్తుతాయి.
న్యూట్రిషనిస్ట్ రితక సమద్దార్ మాట్లాడుతూ — “మారుతున్న వాతావరణంలో ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడం చాలా అవసరం. ఇందుకు సమతుల్య ఆహారం, వ్యాయామం, మంచి నిద్ర, ఆరోగ్యకర జీవనశైలి తప్పనిసరి. బాదం, ఆకుకూరలు, కొవ్వు అధికంగా ఉండే చేపలు వంటి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా కాలిఫోర్నియా బాదం వంటి గింజలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి” అని సూచించారు.
రుతువులు మారినప్పుడు రోగనిరోధక శక్తిని పెంచే చిట్కాలు:
రోజువారీ రక్షణ డోస్:
కాలిఫోర్నియా బాదంలో విటమిన్ ఈ, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి సహజ రక్షణ కవచంలా పనిచేస్తాయి. అలాగే రాగి (కాపర్) కూడా రోగనిరోధక వ్యవస్థ సాధారణ పనితీరుకు తోడ్పడుతుంది.
తగిన నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి:
పోషణతో పాటు శరీరానికి విశ్రాంతి కూడా అంతే ముఖ్యం. ప్రతి రాత్రి 7–8 గంటల నిద్ర ద్వారా శరీరం రీఛార్జ్ అవుతుంది, రోగనిరోధక శక్తి బలపడుతుంది.
హైడ్రేటెడ్‌గా ఉండండి:
చలికాలంలో చాలామంది నీరు తక్కువగా తాగుతారు. కానీ తగినంత నీరు తాగడం శరీర విధులను సక్రమంగా నడపటానికి, టాక్సిన్‌లను బయటకు పంపటానికి, శక్తి స్థాయిలను నిలబెట్టటానికి ఎంతో అవసరం.
సమతుల్యమైన ఆహారం తినండి
భారమైన ఆహారంతో పాటు తాజా పండ్లు, కూరగాయలు, సలాడ్లు, పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోండి. సాల్మన్, అవిసె గింజలు వంటి ఆహారాలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లతో సమృద్ధిగా ఉంటాయి, ఇవి ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
కదులుతూ ఉండండి
చిన్నపాటి వ్యాయామం కూడా శరీరానికి పెద్ద మేలు చేస్తుంది. చురుకైన నడక, స్ట్రెచింగ్, లేదా కుటుంబంతో కలిసి డ్యాన్స్ చేయడం వంటి అలవాట్లు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి, అలసటను తగ్గిస్తాయి. రోజుకు కేవలం 15 నిమిషాలు యాక్టివ్‌గా ఉండడం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది.
రుతువులు మారుతున్నప్పుడు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండటానికి మన రోగనిరోధక వ్యవస్థకు సహాయం చేయడం చాలా ముఖ్యం. కాలిఫోర్నియా బాదం, సాల్మన్ వంటి పోషకాలతో కూడిన ఆహారం, తగిన నీరు, మంచి నిద్ర, చురుకైన జీవనశైలి మీ ఆరోగ్యాన్ని కాపాడి, కొత్త రుతువును ఆనందంగా ఆస్వాదించడానికి సిద్ధం చేస్తాయి.

