Booking app | యూరియా బుకింగ్ ఇక మొబైల్‌లోనే..

Booking app | యూరియా బుకింగ్ ఇక మొబైల్‌లోనే..

  • రాయపోల్ రైతు వేదికలో అవగాహన

Booking app | రాయపోల్, ఆంధ్రప్రభ : యూరియా కోసం ఇకపై దుకాణాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, రైతులు ఇంట్లో నుంచే మొబైల్ ద్వారా యూరియా బుక్ చేసుకోవచ్చని గజ్వేల్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు (ఏడీఏ) బాబు నాయక్ తెలిపారు. రాయపోల్ మండలంలోని రైతు వేదికలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.

రైతులు తమ ఫోన్‌లో ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, మొబైల్ నంబర్‌తో లాగిన్ అయి, పట్టాదారు పాస్‌బుక్ నంబర్ నమోదు చేసి, పంట వివరాలు ఎంటర్ చేస్తే తమ పంటకు ఎంత యూరియా అవసరమో ఆ మేరకు సంచులను బుక్ చేసుకోవచ్చని వివరించారు. పంట వివరాలు నమోదు చేసిన తర్వాత మండలాన్ని ఎంచుకుంటే, ఆ మండలంలో ఉన్న ఎరువుల షాపుల పేర్లు, అక్కడ ఎంత యూరియా అందుబాటులో ఉందో కూడా ఫోన్‌లోనే కనిపిస్తుందని తెలిపారు. డిజిటల్ సైన్ లేకుండా పార్ట్–బీలో సాగు చేసే రైతులు, అలాగే కౌలు రైతులు కూడా ఈ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవచ్చని ఏడీఏ బాబు నాయక్ స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని ఎరువుల దుకాణాల్లో యూరియా బుకింగ్ సౌకర్యం ఉందన్నారు.

Leave a Reply