Bulding | పుస్తకం ఆవిష్కరణ
వికలాంగుల హక్కుల చట్టం 2016 తెలుగులో అనువాదం
Bulding | అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సోమవారం (Monday) నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా విజువల్లి ఛాలెంజ్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగుల హక్కుల చట్టం – 2016 తెలుగు అనువాద పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల హక్కులను రక్షించడం, ప్రోత్సహించడం లక్ష్యంగా వారికి అర్థమయ్యేలా దివ్యాంగుల హక్కుల చట్టం – 2016 తెలుగు అనువాద పుస్తకాన్ని తయారు చేశారని, ఇది దివ్యాంగులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్, ఆనంద్ (Anand) తిప్పేనాయక్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ, దివ్యాంగుల సంక్షేమ శాఖ సుపరింటెండెంట్ అనీల్, విజువల్లి ఛాలెంజ్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జలంధర్ రెడ్డి, ఏపీ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్ హరినాథ్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ప్రతాప్, అసోసియేషన్ మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.

