Boat Capsizes | పశ్చిమ ఆఫ్రికాలోని నైజీరియా (Nigeria) లో మళ్లీ దుర్ఘటన సంభవించింది. వాయువ్య సోకోటో ((Sokoto) రాష్ట్రంలో స్థానిక గోరోన్యో మార్కెట్‌కు వెళ్తున్న ఓ పడవ ( Boat) మధ్యలోనే బోల్తా పడింది. ప్రమాద సమయంలో పడవలో దాదాపు 50 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో కనీసం 40 మంది గల్లంతయ్యారని అధికారిక సమాచారం.

మిగతా వారి కోసం నైజీరియా జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ (NEMA) సిబ్బంది, రక్షణ బృందాలు భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటనతో ప్రాంతమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది.ప్రమాద సమయంలో పడవలో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపింది.

ప్రమాద సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ (Rescue team) హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాదం నుంచి పది మందిని సురక్షితంగా రక్షించింది. ఈ ఘటనలో 40 మంది గల్లంతయ్యారు (40 Missing). ఓవర్‌లోడింగ్‌ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. గల్లంతైన వారికోసం భద్రతా బలగాలు (Security forces) గాలింపు చర్యలు చేపట్టాయి. ఇక ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, నైజీరియాలో పడవ ప్రమాదాలు సర్వసాధారణమే.

Leave a Reply