56 సార్లు రక్తదానం
రక్తదానం చేసిన లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి
నిజాంపేట, అక్టోబర్ 25 (ఆంధ్రప్రభ) : రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేస్తే, నలుగురు ప్రాణాలను ఆపద సమయంలో కాపాడవచ్చని పోలీస్ సూపరింటెండెంట్ డీవీ శ్రీనివాసరావు (DV Srinivasa Rao), అడిషనల్ ఎస్పీ మహేందర్ అన్నారు. శనివారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం” (వారోత్సవాల) సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మెదక్ శాఖ, లయన్స్ క్లబ్బుల సౌజన్యంతో ప్రతి సంవత్సరం నిర్వహించే “రక్తదాన శిబిరం”ను మెదక్ పోలీసు శాఖ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, మహేందర్ అడిషనల్ ఎస్పీఆధ్వర్యంలో మెదక్ ఎస్పీ ఆఫీస్ లో రెడ్ క్రాస్ మెదక్ జిల్లా చైర్మన్ లయన్ డా. ఏలేటి రాజశేఖర్ రెడ్డి 56 వ సారి రక్తదానం చేశారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (Indian Red Cross Society), మెదక్ ఆధ్వర్యంలో రక్తదానంపై రూపొందించిన వాల్‌పోస్టర్‌ను మహేందర్ అడిషనల్ ఎస్పీ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి టి.సుభాష్ చంద్రబోస్ బోస్, కోశాధికారి డీజీ. శ్రీనివాస్ శర్మ, ఎగ్జిక్యూటివ్ సభ్యులు దేమే యాదగిరి, వి.సతీష్ రావు, ప్రసాద్, జీడితిరుపతి, లింగమూర్తి, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

