ఘటనపై బెల్లంపల్లి ఎంహెచ్‌డీ లీడర్ల నిరసన

ఘటనపై బెల్లంపల్లి ఎంహెచ్‌డీ లీడర్ల నిరసన

పసిపాప మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలి
ఎంహెచ్‌డీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుక రాజనర్సు డిమాండ్

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర మల్లన్న జాతరలో కుల వివక్షతో రెండు నెలల పసిపాప మృతికి కారణమైన దుర్మార్గులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని మాదిగ హక్కుల దండోరా (ఎంహెచ్‌డీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుక రాజనర్సు డిమాండ్ చేశారు. సోమవారం బెల్లంపల్లి అంబేడ్కర్ చౌరస్తాలో ఎంహెచ్‌డీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకునూరి రాజ్ కుమార్, అధికార ప్రతినిధి గోగర్ల శేఖర్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా రాజనర్సు మాట్లాడుతూ.. మల్లన్న జాతరలో దైవ దర్శనానికి వెళ్లిన రజక, మాదిగ సామాజిక వర్గాలకు చెందిన మహిళలపై అగ్రకుల దురహంకారంతో దాడి చేయడం అమానుషమన్నారు. పసిపాప అని కూడా చూడకుండా కళ్ళతో తన్ని చంపిన నిందితులు తుకారాం రెడ్డి, మధుకర్ రెడ్డి, శ్రీనివాస రెడ్డిలను వెంటనే అరెస్టు చేయాలన్నారు. వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు హత్య నేరం కింద కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించి రక్షణ కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంహెచ్‌డీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగారపు కోళ్ల రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకునూరి రాజ కుమార్ జిల్లా అధికార ప్రతినిధి గోగర్ల శేఖర్, జిల్లా కార్యదర్శి ఇడిగిరాల ప్రసాద్ పట్టణ గౌరవ అధ్యక్షుడు ఆరేపెళ్లి రమేష్, పట్టణ యువజన నాయకులు గద్దల కుమార్ పట్టణ సీనియర్ నాయకులు పల్లె రమేష్, నాథరి భీమయ్య పట్టణ సీనియర్ నాయకులు కంపెళ్లి సతీష్, ఎరుకల సంఘము జిల్లా నాయకులు ఉండాడి మల్లయ్య పట్టణ నాయకులు ఆరేపెళ్లి నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply