BJP | అభ్యర్థులను గెలిపించండి

BJP | అభ్యర్థులను గెలిపించండి

పరకాల బీజేపీ కాంటెస్ట్ ఎమ్మెల్యే డాక్టర్ ఖాళి ప్రసాద్ రావు


BJP | పరకాల, ఆంధ్రప్రభ : సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికల్లో బీజేపీ (BJP) అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ పరకాల కాంటెస్ట్ ఎమ్మెల్యే డాక్టర్ ఖాళి ప్రసాద్ రావు (Prasad Rao) అన్నారు. పరకాల నియోజకవర్గం 2వ విడత సర్పంచ్, వార్డ్ మెంబర్ల ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా భారతీయ జనతా పార్టీ తరపున పరకాల నియోజకవర్గంలోని పరకాల రూరల్ మండల్ నాగారం గ్రామానికి చెందిన మాచబోయిన రవళి క్రాంతి కుమార్, పైడిపల్లి గ్రామానికి చెందిన పసుల బిక్షపతి మల్కాపేట గ్రామానికి చెందిన తిక్క స్వరూప కమలాకర్ లు ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థులకు బీజేపీ రాష్ట్ర నాయకులు, పరకాల నియోజకవర్గం కాంటెస్ట్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు మనోధైర్యం కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నామినేషన్ (Nomination) దాఖలు చేసిన అభ్యర్థులను అభినందిస్తూ రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయం మీ లక్ష్యమని, గ్రామాల్లో అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. గ్రామ స్వరాజ్యమే బీజేపీ ధ్యేయం, అభివృద్ధి తమ లక్ష్యం, రానున్న ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో పరకాల రూరల్ (Parakala Rural) మండల అధ్యక్షులు కాసగాని రాజ్ కుమార్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జయంత్ లాల్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ మేకల రాజవీరు, పరకాల పురపాలక సంఘం 9వ వార్డ్ తాజా మాజీ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణాచారి, జిల్లా కౌన్సిల్ మెంబర్ బాబు, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కట్టగాని శ్రీకాంత్, ధూమాల నగేష్, సంగెం శ్రీనివాస్, రాసమల్ల నవీన్, అల్లం విజయ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply