పార్లమెంటు సభ్యులు డికె.అరుణ కృషి వల్లే నిధులు మంజూరు

పార్లమెంటు సభ్యులు డికె.అరుణ కృషి వల్లే నిధులు మంజూరు
- బిజెపి జిల్లాప్రధాన కార్యదర్శి బలరాం రెడ్డి
మక్తల్ , ఆంధ్రప్రభ ; కేంద్ర కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని మక్తల్ నియోజకవర్గం గుడేబల్లుర్ _ మహబూబ్నగర్ మధ్యన 80 కిలోమీటర్ల దూరం నాలుగు లైన్ల రోడ్డు(167వ జాతీయ రహదారి) విస్తరణకు 3175 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జి.బలరాం రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు చేయడానికి కృషి చేసినటువంటి పాలమూరు పార్లమెంటు సభ్యురాలు డి.కె.అరుణమ్మ కు కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల హైదరాబాద్ నుండి పనాజీ ( గోవా)కి వెళ్లే దూరం తగ్గడమే కాకుండా దాదాపు 3 గంటల సమయం ఆదా అవుతుందని అన్నారు.
దీనివల్ల ఆర్థికంగా ఎంతో లాభం చేకూరుతుంది అంతేకాకుండా జడ్చర్ల సెజ్ , రాయిచూర్ _ బళ్లారి కారిడార్,( హైదరాబాద్_ బెంగళూరు )జడ్చర్ల వరకు గల కారిడార్ కు ఎంతో ఉపయోగం కలుగుతుందన్నారు. ఈ రోడ్డు తో పాటు తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోడ్లకు నిధులు మంజూరు చేసి తెలంగాణ అభివృద్ధి పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం మరోసారి తన చిత్తశుద్ధినీ నిరూపించుకున్నదన్నారు.గుడెబల్లూర్ – మహబూబ్ నగర్ నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి, నిధుల విడుదలకు కృషి చేసిన పార్లమెంటు సభ్యులు డికె అరుణ కేంద్ర ప్రభుత్వానికి బిజెపి నారాయణ పేట జిల్లా ప్రధాన కార్యదర్శి జి.బలరాం రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
