BJP | ఎవరీ.. బెనారస్ బాబు..

BJP | ఎవరీ.. బెనారస్ బాబు..

BJP, ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల మండల బీజేపీ అధ్యక్షులు తాళ్లూరి ఫణి హరిప్రసాద్ గృహానికి బెనారస్ బాబు వచ్చారు. హరి ప్రసాద్ తండ్రితో ఉన్న పరిచయాల నేపథ్యంలో హరిప్రసాద్ గృహానికి వచ్చారు. హరిప్రసాద్ తండ్రి ఇటీవల మరణించారు. దీంతో హరి ప్రసాదును బెనారస్ బాబు పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రసిద్ధ బెనారస్ బాబు ఘంటసాల (Ghantasala) వచ్చిన విషయం తెలుసుకున్న ఘంటసాల మార్కెట్ కమిటీ ఛైర్మన్ తోట కనకదుర్గ మర్యాదపూర్వకంగా బెనరస్ బాబును కలిసి, ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.

బెనారస్ బాబు హిందూ దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతిగా, శ్రీ విజయ కనకదుర్గా దేవస్థాన వ్యవస్థాపకులు, శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్యా మహా పీఠ కమిటీ సభ్యులుగా, ఎనిమిది రాష్ట్రాలలో ధర్మ ప్రచారకులుగా, విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక తెలంగాణ రాష్ట్ర కోశాధికారిగా, హ్యూమన్ రైట్స్, సోషల్ జస్టిస్ కమిషన్ కు ఉభయ తెలుగు రాష్ట్రాల (Telugu States) ఉపాధ్యక్షులుగా, దేవి ఉపాసకులుగా, తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ దేవాలయాలకు సలహాదారులుగా కొనసాగుతున్నారు. అలాగే భక్త నిధి, ధార్మిక రత్న, మంత్ర వేత్త, దేవత ప్రతిష్టాపకులు.. ఇలా పలు బిరుదులు ఆయన పొందారు.

Leave a Reply