BJP | చర్యలు తీసుకోవాలి

BJP | చర్యలు తీసుకోవాలి

  • అమోదించిన నామినేషన్లను ఎలా రిజెక్ట్ చేస్తారు
  • అవసరమైతే హైకోర్టులో కేసు వేస్తాం
  • బీజేపీ సీనియర్ నాయకులు నాగురావ్ నామాజీ


BJP | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు నామినేషన్లు వేస్తే స్క్రూటిని తర్వాత అప్పీల్ కు సమయం ఇవ్వకుండా రిజెక్ట్ చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లేనని బీజేపీ (BJP) సీనియర్ నాయకులు నాగురావ్ నామాజీ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగురావు నామాజీ మాట్లాడుతూ.. నారాయణపేట మండలం లింగంపల్లి గ్రామంలో ఇద్దరు అభ్యర్థులు సర్పంచ్ ఎన్నిక కోసం నామినేషన్లు వేస్తే ఎన్నికల రిటర్నింగ్ అధికారి రెండు నామినేషన్లు స్వీకరణ చేశామని నోటీసు బోర్డుపై అతికించి తీరా సాయంత్రం ఐదు గంటల తర్వాత ఓ అభ్యర్థి నామినేషన్ రిజెక్ట్ అయిందని చెప్పడం ఎన్నికల నిబంధన ఉల్లంఘన కిందికి వస్తుందన్నారు. చట్టాలను చేతిలోకి తీసుకునే అధికారం ఎవరికి కూడా లేదన్నారు.

అలాగే పేరపల్ల గ్రామ రెండవ వార్డ్ పరిధిలో కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, దీనిపై రాష్ట్ర ఎన్నికల (Election) అధికారికి, కలెక్టర్, ఆర్డీవోకు ఫిర్యాదు చేశామన్నారు. వెంటనే అధికారులు స్పందించి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు సత్య యాదవ్, పోషల్ వినోద్, రఘువీర్ యాదవ్, నందు నామాజీ, కిరణ్ డగే, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply