Bikkanuru | ప్రజలకు, ప్రభుత్వానికి వారధి ఆంధ్రప్రభ….

Bikkanuru | ప్రజలకు, ప్రభుత్వానికి వారధి ఆంధ్రప్రభ….

  • బిక్కనూర్ ఎస్సై ఆంజనేయులు….

Bikkanuru | బిక్కనూర్, ఆంధ్రప్రభ : ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఆంధ్రప్రభ దినపత్రిక పనిచేస్తుందని బిక్కనూర్ ఎస్సై ఆంజనేయులు అన్నారు. తన కార్యాలయంలో ఆంధ్రప్రభ దినపత్రికకు సంబంధించిన క్యాలెండర్లను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ… దశాబ్ద కాలంగా ఆంధ్రప్రభ దినపత్రిక దినదినాభివృద్ధి చెందుతూ ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తుందని గుర్తు చేశారు. ఆంధ్రప్రభలో వస్తున్న పలు శీర్షికలు చదవడానికి ఎంతో ఆసక్తిగా ఉంటాయని తెలిపారు. ఆంధ్రప్రభ దినపత్రికతో పాటు స్మార్ట్ ఎడిషన్, యూట్యూబ్ ఛానల్, వెబ్ న్యూస్ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేరుస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రభ యజమాన్యం తీసుకున్న నిర్ణయాల పట్ల ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రతిరోజు ఆంధ్రప్రభ దినపత్రిక చదవడం తనకు అలవాటుగా మారిందన్నారు. పోలీస్ శాఖ తరపున ఆంధ్రప్రభ దినపత్రిక యాజమాన్యం సిబ్బందికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్రప్రభ కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ జంగం బాల ప్రకాష్, ఏఎస్ఐ గంగారెడ్డి, కే జే యల్ రాంరెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Leave a Reply