Bikkanoor | ప్రజాసేవకు అంకితం..

Bikkanoor | బిక్కనూర్, ఆంధ్రప్రభ : చేతులెత్తి మొక్కుతున్నా.. మీ బిడ్డగా తమను ఆశీర్వదించి చెత్త డబ్బాకు ఓటు వేయాలని సర్పంచ్ అభ్యర్థి పెద్ద బచ్చ సరిత నరసింహారెడ్డి కోరారు. పట్టణంలో ఆమె విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. అడుగడుగునా ఓటర్లు ఆమెకు అండగా నిలుస్తున్నారు. పలు వార్డులలో ఉన్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి సరిత మాట్లాడుతూ.. తమను గెలిపిస్తే.. ప్రజాసేవకు అంకితం అవుతామని చెప్పారు.
సమస్యలు లేని పట్టణంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. తమపై నమ్మకంతో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పట్టణంలో కోతుల బెడద నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె చెప్పారు. అన్ని వార్డులలో మురికి కాలువలు, సిమెంటు రోడ్లు, ఇంటింటికి తాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు. మీ ఇంటి బిడ్డగా తమను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తెస్తే తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మహిళా సంఘాలకు కుల సంఘాలకు, యువకులకు తాను ఎల్లవేళలా అండగా నిలుస్తానని చెప్పారు.
