హెల్మెట్ ఫర్ ఎవిరీ బడీ- రూల్ ఫర్ ఆల్….

హెల్మెట్ ఫర్ ఎవిరీ బడీ- రూల్ ఫర్ ఆల్….

బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ..
శిరో రక్ష ప్రాణ రక్ష..

బాపట్ల, ఆంధ్రప్రభ : బాపట్ల పట్టణంలో బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ఎస్పీ ఉమామహేశ్వర్ నేతృత్వంలో హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ అంటే కేవలం చట్టబద్ధమైన నియమం మాత్రమే కాదు అది ఒక కుటుంబానికి భద్రత అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జిల్లా పోలీస్ శాఖ కీలక అడుగులు వేసింది. బాపట్ల పట్టణంలో జిల్లా పోలీస్ శాఖ జిల్లా రవాణా శాఖ అధికారులతో కలిసి హెల్మెట్ వాడకం పై అవగాహన బైక్ ర్యాలీ పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి పట్టణంలోని అంబేద్కర్ స్టాట్యూ వరకు నిర్వహించి రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేసింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ మాట్లాడుతూ ఏపీ డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. హెల్మెట్ ధరించడం భారం కాదు బాధ్యతగా భావించాలని, వేగం కాదు క్షేమమే ముఖ్యం హెల్మెట్ తోనే భద్రత, హెల్మెట్ ఫర్ ఎవరీ బడీ రూల్ ఫర్ ఆల్ అంటూ జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్‌ ధరించి సురక్షితంగా ప్రయాణించాలని, హెల్మెట్‌ లేక ఏటా రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మృతి చెందుతున్నారు అని అన్నారు.

దీని వినియోగంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పోలీసుల ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. జిల్లా రవాణా శాఖ అధికారి టి పరంధామ రెడ్డి, ఎం వి ఐ రంగారావు, బాపట్ల డిఎస్పి జగదీష్ నాయక్, పట్టణ సీఐ రాంబాబు, రూరల్ సీఐ ప్రభాకర్ రావు, రూరల్ సర్కిల్ సీఐ హరికృష్ణ, ఆర్ ఐ శ్రీకాంత్, ఎస్బి సీఐ రాంబాబు, పట్టణ పోలీసులు పాల్గొన్నారు.

Leave a Reply