బీహర్ అభ్యర్థులపై కసరత్తు
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) నివాసంలో ఆ పార్టీ కోర్ కమిటీ సమావేశం ప్రారంభం అయ్యింది. ముఖ్యంగా బీహార్ అసెంబ్లీ సీట్ల సర్దుబాటుపై ఢిల్లీలోని ఆయన నివాసంలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.
ఈ భేటీకి బీహార్ ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు (Bihar NDA alliance parties Leaders) హాజరయ్యారు. బీహార్ లో 243 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇప్పటికే మెజార్టీ సీట్లపై నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఇంకా 12 సీట్లపై మాత్రం ఏకాభిప్రాయం కుదరలేదని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈనెల 13వ తేదీన పాట్నా వేదికగా సీట్లపై ఎన్డీఏ కూటమి నేతలు ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కూటమిలో ఉన్న కీలక నేతలతో బీజేపీ అగ్ర నేతలు చర్చలు జరిపారు. రేపు సాయంత్రం 6 గంటలకు బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం.