Bigg Boss 9: ఆ న‌లుగురు!

Bigg Boss 9: ఆ న‌లుగురు!

Bigg Boss 9 : వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : బిగ్ బాస్ ఫినాలేకి ముందే డబుల్ ఎలిమినేషన్ (Elimination) తప్పదని ఊహించిందే! 11 వ వారం ఇమ్మాన్యులు పవర్ అస్త్ర వినియోగించడంతో గత వారం ఎలిమినేషన్ రద్దైన సంగతి తెలిసిందే! దీంతో 12వ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని అందరూ ఊహించిందే! అదే విధంగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్ప వచ్చు.

డబుల్ ఎలిమినేషన్ ఖాయం!


ఉత్కంఠ భరితంగా సాగుతున్న రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ (Bigg Boss) సీజన్ 9 చదరంగం కాదు రణరంగమే! అన్నట్లు ఈ వారం కెప్టెన్సీ టాస్క్ అలానే జరిగింది. 12 వ వారం పూర్తి చేసుకుని 13వ‌ వారంలోకి అడుగుపెట్టబోతుంది. గ్రాండ్ ఫినాలేకు మరో రెండు వారాల్లో చేరువ కానున్నది. దీంతో హౌస్‌లో గేమ్ మరింత వేడెక్కింది. టైటిల్ కోసం పోరాడుతున్న కంటెస్టెంట్లకు ఈ వారం హోస్ట్ నాగార్జున డబుల్ షాక్ ఇస్తారు.

డేంజర్ జోన్ లో…


ఇంతకీ ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? అనేది సోషల్ మీడియా చర్చలు, వివిధ ఆన్లైన్ పోల్స్ ప్రకారం ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న దివ్య నిఖిత, సంజనా గల్రానీ, సుమన్ శెట్టి, భరణీ డేంజర్ జోన్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. శుక్రవారం అర్ధ‌రాత్రి వరకు జరిగిన అన్‌ఆఫీషియల్ పోల్స్ ప్రకారం కళ్యాణ్ పడాలా, తనూజ టాప్ లో ఉన్నారు. డేంజర్ జోన్ లో న‌లుగురు ఉన్న‌ట్లు తెలిసింది. భ‌ర‌ణి కంటే సుమ‌న్ శెట్టి కేవ‌లం 0.05 శాతం ఓట్లు వెనుక‌బ‌డి ఉన్న‌ట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతుంది. సంజనా, దివ్య (Divya) చివ‌రి స్థానాల్లో ఉన్నారు. మిగిలిన క‌ళ్యాణ్‌, త‌నూజ‌, ఇమ్మాన్యుల్ క‌చ్చితంగా పినాలేకి చేరుకునే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. మిగిలిన వారిలో ముగ్గురిలో భ‌ర‌ణి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. ప‌వ‌న్‌, సుమ‌న్‌శెట్టి ఇద్ద‌రూ గ‌ట్టిగా పోటీ ప‌డాల్సి ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఎవ‌రు ఎలిమినేట్ అవుతున్నారో ఈ రాత్రికి తేలిపోతుంది.

Leave a Reply