Bigg Boss-9 | ఆ ఆరుగురికి కీలకమే!

Bigg Boss-9 | ఆ ఆరుగురికి కీలకమే!
- అందని అంచనా.. ఒకరే అవుట్
- నెరవేరని రీతూ కోరిక
- నాలుగు ప్లేస్‌లు.. ఆరుగురు పోటీ
Bigg Boss-9 | వారం మధ్యలో ఎలిమినేషన్ ఉంటుందా?
Bigg Boss-9 | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తొమ్మిదో సీజన్లో బిగ్ బాస్ ఇస్తున్న ట్విస్ట్ లు ఎవరి ఊహలకు అందడం లేదు. ఈ వారం ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారని భావించిన వీక్షకులకు… అలాగే టాప్-5లో ఉంటానని భావంచిన రీతూ చౌదరికి బిగ్ షాక్ తగిలింది. బిగ్ బాస్ (BIGG BOSS) 13 వ వారం ఇంటి నుంచి రీతూ ఎలిమినేట్ అయ్యింది. ఈ వారం ఇద్దరు ఎలిమినేషన్ అవుతారని అందరూ ఊహించారు. కానీ ఈ వారం కూడా ఒకరినే ఎలిమినేషన్ చేశారు. ఈ సీజన్ లో ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలాయి. ఈ వారంలో బిగ్‌బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో చూడాలి మరి! ఫైనల్ కు చేరుకున్న కళ్యాణ్ పడాల తప్ప మిగిలిన ఆరుగురు నాలుగు ప్లేస్‌ల కోసం పోటీ పడాల్సి ఉంటుంది. దీంతో ఆరుగురు ఇంటి సభ్యులకు ఈ వారం కీలకంగా మారింది.
Bigg Boss-9 | వెక్కివెక్కి ఏడ్చిన రీతూ…
బిగ్ బాస్ -9 సీజన్ ఇంట్లో నవ్వుల బ్యూటీ రీతూ చౌదరి ప్రయాణం ముగిసింది. ఎవరి అంచనాలకు అందని విధంగా 13వ వారంలో ఎలిమినేట్ అయిపోయింది. టాప్-5 కి చేరాలన్న కోరిక నెరవేరకుండా బిగ్‌బాస్ ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఓ వైపు టాస్క్‌లు (TASK) కంప్లీట్ చేస్తూ డీమాన్ పవన్‌తో రిలేషన్ షిప్ప్ కంటిన్యూ చేసేది. తనూజతో మంచి బాండింగ్ ఉన్న రీతూ నవ్వులకు బిగ్ బాస్‌లోనే కాదు… కొంత మంది వీక్షకులు కూడా ఫేన్ అయ్యారు. ప్రతి వారం హోస్ట్‌గా వచ్చిన నాగార్జున అక్కినేని కూడా రీతూ నవ్వులకు ఫిదా అయ్యేవారు. ఈ వారం నుంచి ఆ నవ్వులు బిగ్‌బాస్ హౌస్‌లో కనిపించవు! అయితే బిగ్‌బాస్‌లో టాప్-5 కి చేరుతానని కోరిక నెరవేరకుండా రీతూను వీక్షకులు ఇంటి బాట పట్టించారు. ఎలిమినేట్ అయ్యాను అని తెలిసిన వెంటనే రీతూ వెక్కివెక్కి ఏడ్చింది.

Bigg Boss-9 | ఆ ఆరుగురిలో టాప్-5కి చేరేది ఎవరో?
రీతూ చౌదరి ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్‌బాస్ హౌస్‌లో(House) ఏడుగురు మిగిలారు. పడాల కళ్యాణ్, తనూజ పుట్టస్వామి, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్ , భరణి శంకర్, సుమన్ శెట్టి, సంజన గల్రానీ ఉన్నారు. వీళ్లలో పడాల కళ్యాణ్ అల్రెడీ ఫస్ట్ ఫైనలిస్ట్ కి చేరుకున్నాడు. మిగిలిన నాలుగు ప్లేస్ ల గురించి ఆరుగురు పోటీపడుతున్నారు. ఇందులో ఇమ్మాన్యుయేల్, తనూజ కచ్చితంగా టాప్-5 చేరతారనే ఊహగానాలు ఉన్నాయి. మిగిలిన రెండు ప్లేస్‌ల కోసం ఐదగురు పోటీ పడవలసి ఉంటుంది. భరణి శంకర్, డీమాన్ పవన్, సుమన్‌శెట్టి, సంజన గల్రానీ రెండు ప్లేస్‌ల కోసం పోటీ పడాల్సి ఉంటుంది.
Bigg Boss-9 | మధ్యలో ఎలిమినేషన్ ఉంటుందా?
ప్రస్తుతం ఐదు ప్లేస్‌ల కోసం ఇంట్లో ఏడుగురు ఉన్నారు. ఇందులో పడాల కళ్యాణ్ ఫైనల్ (Final) లిస్టుకు చేరుకున్నాడు కాబట్టి నామినేషన్ ప్రక్రియలో ఉండడు. మిగిలిన ఆరుగురు నామినేషన్ ప్రక్రియ ఉన్నారు. ఈ సారి వారం మధ్యలో ఎలిమినేషన్ టాస్క్ ఇచ్చే అవకాశం ఉంటుందనే అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే ఒకే వీక్‌లో ఇద్దరు ఎలిమినేట్ చేయాలంటే మధ్యలో కూడా టాస్క్ ద్వారా కూడా ఎలిమినేషన్ చేసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. లేదా రెండో ఫైనల్ లిస్టు కోసం టాస్క్ ఇవ్వొచ్చు అని వీక్షికులు భావిస్తున్నారు.

