Bigg Boss 9| అస‌లు ర‌ణ‌రంగం ఈ వార‌మే!

Bigg Boss 9| అస‌లు ర‌ణ‌రంగం ఈ వార‌మే!

  • ఆ ఐదుగురు ఎవ‌ర‌న్న‌ది చ‌ర్చ‌!

Bigg Boss 9 | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : బిగ్ బాస్ సీజ‌న్ – 9 చ‌ద‌రంగం కాదు.. ర‌ణ‌రంగం అంటూ హోస్ట్ నాగార్జున అక్కినేని (Nagarjuna Akkineni) ప‌దేప‌దే చెబుతున్న సంగ‌తి విదిత‌మే. ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగింది ఒక ఎత్తు. ఇప్పుడు జ‌ర‌గ‌బోయేది మ‌రో ఎత్తు. మ‌రో మూడు వారాల్లో బిగ్ బాస్ (Big Boss) ఫినాలే జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో బిగ్ బాస్ ఇంటి సభ్యుల‌కు ఇదీ కీల‌క స‌మ‌యం కూడా. గ‌త వారం కెప్టెన్సీ టాస్క్ కూడా క‌ఠిన‌మైన‌దే ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఈ వారం ఎలాంటి టాస్క్‌లు ఉంటాయో అటు కుటుంబ స‌భ్యులు, ఇటు ప్రేక్ష‌కులు (Audience) కూడా ఊహించ‌క‌పోవ‌చ్చు. ఈ రోజు (సోమ‌వారం) నామినేష‌న్ ప్ర‌క్రియ జ‌రుగుతుంది. ఫినాలే ద‌గ్గ‌ర ప‌డుతుంది కూడా నామినేష‌న్ లు కూడా ఓ పెద్ద ర‌ణ‌రంగ‌మే. గ‌త వారం కూడా యుద్ధ‌వాతావ‌ర‌ణం త‌ల‌పించింది. ప్ర‌స్తుతం బిగ్ బాస్ ఇంటిలో క‌ళ్యాణ్ (చివ‌రి కెప్టెన్‌), త‌నూజ‌, ఇమ్మాన్యుయేల్‌, రీతూ, ప‌వ‌న్‌, భ‌ర‌ణి, సుమ‌న్ శెట్టి, సంజ‌నా ఉన్నారు. మ‌రో రెండు వారాలు ఎలిమినేష‌న్ (Elimination) ముగ్గురిని ఇంటి నుంచి బ‌య‌ట‌కు పంపించాలి. గ‌తంలో మాదిరిగా మ‌ధ్య‌లో ఎలిమినేష‌న్ ఉంటుందా? ఒక వారం ఇద్ద‌రి స‌భ్యుల ఎలిమినేష‌న్ ఉంటుందా? అనేది ప్రేక్ష‌కులు చ‌ర్చించుకుంటున్నారు.

Bigg Boss 9 |దివ్య అవుట్‌!

Bigg Boss 9


బిగ్‌బాస్ సీజన్-9లో గత వారం ఇమ్మాన్యుయేల్​ పవరాస్త్రతో సేవ్​ అయిన దివ్య.. ఈ వారం ఎలిమినేట్ అయిపోయింది. ముందు నుంచే ఎలిమినేషన్​ను ప్రిపేర్ ​(prepare) అవ్వడంతో పెద్దగా ఎమోషనల్​ అవ్వలేదు. నామినేషన్స్‌లో ఉన్న ఒక్కొక్కరూ సేవ్ కాగా చివరికి సుమన్ శెట్టి, దివ్య మిగిలారు. దీంతో వీరిద్దరినీ యాక్టివిటీ (Activity) ఏరియాకి రమ్మని పిలిచారు. అక్కడ అగ్నిపర్వతం సెటప్ చేసి.. చివరికి దివ్య ఎలిమినేట్ అంటూ ప్రకటించారు.

Bigg Boss 9 |ఈ రోజే నామినేష‌న్ ప్ర‌క్రియ‌!


ఈ రోజు నామినేష‌న్ ప్ర‌క్రియ‌పై జోరుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ప్ర‌తి సోమ‌వారం నామినేష‌న్ ప్ర‌క్రియ(Nomination process) జ‌రుగుతుంది. అదే విధంగా ఈ రోజు కూడా జ‌రుగుతుంది. అయితే కెప్టెన్ అయిన క‌ళ్యాణ్ త‌ప్ప మిగిలిన వారు నామినేష‌న్ ల‌కు అర్హులు. అయితే బిగ్‌బాస్ నేరుగా అంద‌రినీ నామినేష‌న్ చేస్తారా? ఇంటి స‌భ్యుల‌తో చేయిస్తారా? అనేది చూడాలి. ఒక‌వేళ ఇంటి స‌భ్యులే నామినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభిస్తే యుద్ధ‌వాతావ‌ర‌ణం (War atmosphere) త‌ల‌పించే అవ‌కాశం ఉంటుంది.

Bigg Boss 9 | ఆ ఐదుగురు ఎవ‌ర‌న్న‌ది చ‌ర్చ‌!


Bigg Boss 9 | మ‌రో మూడు వారాల్లో జ‌ర‌గ‌నున్న ఫినాలే కోసం ఇప్ప‌టి నుంచి ప్రేక్ష‌కుల్లో చ‌ర్చ ప్రారంభ‌మైంది. టాప్ ఫైవ్ ఎవ‌ర‌న్న‌ది ప్ర‌స్తుతం జోరుగా చ‌ర్చ (Heated discussion) జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం ఉన్న స్ట్రాంగ్ గా ఉన్న వారిలో క‌ళ్యాణ్‌, త‌నూజ‌, ఇమ్మాన్యుయేల్‌, రీతూ ఉన్నారు. వీరికి అభిమానుల మ‌ద్ద‌తు (Fan support) కూడా ఉంది. దాదాపు ప్ర‌తి వారం నామినేష‌న్‌లో ఉంటూ సేవ్ అవుతున్న సంజ‌నాకు అభిమానుల మ‌ద్ద‌తు ఉంద‌నే చెప్పాలి. కాక‌పోతే కొంత వ‌ర‌కు మాట జార‌డం, ఆట‌ల్లో వెనుక‌బ‌డిపోవ‌డంతో ఆమె ప‌రిస్థితి ప్ర‌శ్నార్థ‌కంగా(Interrogatively) ఉంది. ఇక మ‌రొక ప్లేస్ కోసం భ‌ర‌ణి, ప‌వ‌న్‌, సుమ‌న్‌శెట్టి, సంజ‌నా రేస్‌లో ఉన్నారు. ఈ ప్లేస్‌లో భ‌ర‌ణి గానీ, ప‌వ‌న్ గానీ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయ‌ని ప్రేక్ష‌కులు భావిస్తున్నారు. సుమ‌న్ శెట్టికి మంచి ఫాలోయింగ్ ఉన్నా… సేఫ్ గేమ్ ఆడుతున్నార‌నే అప‌వాదు కూడా లేక‌పోలేదు.

Click Here To Read More

Click Here To Read  వెహికిల్ మెస్మరైజ్ చేస్తుంది – బోయపాటి

Leave a Reply