Bhuvaneshwari | వైద్యానికి అధిక ప్రాధాన్యత..
Bhuvaneshwari | పామర్రు, ఆంధ్రప్రభ : వైద్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి (Chiefminister) నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గంలోని నిమ్మకూరు గ్రామంలో ఆరు కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు నారా భువనేశ్వరి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదల వైద్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందిస్తున్నట్లు తెలిపారు. నాన్న స్వగ్రామమైన నిమ్మకూరులో (Nimmakuru) కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏర్పాటుతో మరిన్ని వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ గ్రామం పట్ల, ఇక్కడి ప్రజల పట్ల తనకు చాలా అభిమానం ఉందని తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా తదితరులు పాల్గొన్నారు.

