Phone Tapping Case | జైలు నుంచి భుజంగరావు, రాధాకిషన్‌రావు రిలీజ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులైన ఎస్‌బీఐ మాజీ రాధాకిషన్‌రావు, అదనపు ఎస్పీ భుజంగరావు శుక్రవారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఇద్దరికీ హైకోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఇద్దరు రూ.లక్ష చొప్పున ఇద్దరి పూచీకత్తులను సమర్పించగా… ఇద్దరు నిందితులు ప్రతి సోమవారం ఉదయం 11 గంటలకు పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. ఎనిమిది వారాలపాటు పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరై విచారణాధికారికి సహకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
మీడియా సమావేశంలో పాల్గొని అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని.. సాక్షులను, వారి కుటుంబాలను ప్రభావితం చేయవద్దని ఆదేశించింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే బెయిల్‌ను రద్దు చేసేలా చర్యలు తీసుకునే అధికారం దర్యాప్తు అధికారికి ఉందని పేర్కొంది.
కాగా, ఇటీవల సస్పెండెడ్ అదనపు ఎస్పీ తిరుపతన్న జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక నిందితుల్లో ప్రస్తుతం ప్రణీత్‌రావు ఒక్కరే చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.