Bhiknoor | విరాళం అందజేత…

Bhiknoor | విరాళం అందజేత…

Bhiknoor | భిక్కనూరు, ఆంధ్రప్రభ : భిక్కనూర్ పట్టణంలో విద్యా వికాసానికి కృషి చేస్తున్న శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాల అభివృద్ధి కోసం పోసానిపేట గ్రామానికి చెందిన ప్రముఖ దాత తంకర రాజయ్య లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ విరాళాన్ని పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో అధికారికంగా అందజేయగా, ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రబంధకారిణి కమిటీ సభ్యులు, సంచాలక సమితి కమిటీ సభ్యులు, సలహా సమితి కమిటీ సభ్యులు, విద్వత్ సమితి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఈసందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ… నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తూ విద్యార్థులను సమగ్రంగా తీర్చిదిద్దుతున్న శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాల అభివృద్ధికి తంకర రాజయ్య విరాళం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధి, విద్యా కార్యక్రమాల విస్తరణ, విద్యార్థుల అవసరాల కోసం ఈ విరాళాన్ని వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. సామాజిక బాధ్యతతో విద్యా రంగానికి సహకరిస్తున్న తంకర రాజయ్య సేవలను ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవలు కొనసాగించాలని ఆకాంక్షిస్తూ, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల, తల్లిదండ్రుల తరఫున తంకర రాజయ్యకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply