Bheengal Town | ఇటు ప్రమాణం.. అటు అభివృద్ధి ప్రారంభం

Bheengal Town | భీంగల్ టౌన్/ రూరల్, ఆంధ్రప్రభ : ఇచ్చిన మాట మేరకు ప్రమాణ స్వీకారం చేసిన మెదటి రోజే అభివృద్ధి పనులను ప్రారంభించారు మెండోరా సర్పంచ్ కుంట లక్మీ రమేష్. సర్పంచ్ ఎన్నికల్లో గ్రామానికి చెందిన మహిళల సంక్షేమం కొరకు కృషి చేస్తానని చెప్పారు. అందులో భాగంగా మహిళా అభివృద్ధి కొరకు తొలి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. పేర్కొన్న విధంగానే ప్రమాణ స్వీకారం మొదటి రోజు మహిళా భవనం నిర్మాణం కొరకు భూమి పూజ చేశారు. ఇచ్చిన మాట మేరకు అభివృద్ధి పనులకు భూమి పూజ చెయ్యడం సంతోషంగా ఉందని సర్పంచ్ తెలిపారు.
