Bheemgal | ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

Bheemgal | ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
Bheemgal | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమ్‌గల్ (Bheemgal) పట్టణంలోని బడా భీమ్‌గల్ చౌరస్తా వద్ద దళిత ఐక్య సంఘటన తాజా మాజీ అధ్యక్షులు గడాల ప్రసాద్ ( Gadala Prasad) ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ (Dr. Babasaheb Ambedkar) విగ్రహానికి బుధవారం పూలమాలలు వేసి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా దళిత ఐక్య సంఘటన తాజా మాజీ అధ్యక్షులు గడాల ప్రసాద్, సీనియర్ నాయకులు గౌరవ అధ్యక్షులు కాంతయ్య, యువజన నాయకులు మాట్లాడుతూ… భారత రాజ్యాంగం మహోన్నత మైనదని పేర్కొన్నారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులతో పాటు విధులు, బాధ్యతలు పౌరులు గుర్తెరిగి రాజ్యాంగం పరిరక్షణకు ప్రతి పౌరుడు కృషి చేయాలని కోరారు.
భారత రాజ్యాంగం ఒక విప్లవాత్మక లిఖిత గ్రంథం, ప్రత్యామ్నాయ భావజాలంతో కూడిన దేశ అభివృద్ధికి సంబంధించినధని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ (Dr. Babasaheb Ambedkar) పూర్తి సమయాన్ని,తన మేధస్సును రాజ్యాంగ రచనకి కేంద్రీకరించారని అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం మన భారత రాజ్యాంగం అని భారత రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుని పై ఉందని తెలుపుతూ భారత రాజ్యాంగం వర్ధిల్లాలని నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో గౌరవ ఉపాధ్యక్షులు దేవిదాస్, సంతోష్, గణేష్ కమిటీ సభ్యులు సునీల్, యోనా, రతన్ రాజ్, శ్రీనివాస్, రాజేందర్, రవీందర్, నేనావత్, లడ్డు, స్టోనీ, నరేష్, రాహుల్, తదితరులు పాల్గొన్నారు.
